NTV Telugu Site icon

Revanth Reddy: నేడు కేరళకు వెళ్లనున్న తెలంగాణ సీఎం..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో ఆమె గెలుపు కోసం హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. దీంతో రాయ్‌ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేసేశారు. ఈ నేపథ్యంలో అక్కడ బై ఎలక్షన్ అనివార్యమైంది.

Read Also: MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్

ఇక, గాంధీ కుటుంబాన్ని రాయ్‌ బరేలి, అమేథీ తర్వాత వయనాడ్‌ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. 2019లో కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో రాహుల్‌ గాంధీ ఓడిపోవడంతో.. వయనాడ్‌లో మాత్రం అఖండ విజయాన్ని ఇక్కడి ప్రజలు అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్‌ గాంధీని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. దీంతో గాంధీ కుటుంబానికే చెందిన ప్రియాంకను ఇక్కడ ఎన్నికల బరిలోకి దించారు. వయనాడ్‌లో యూడీఎఫ్‌ తరఫున కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ ఈ నెల రేపు (అక్టోబర్ 23న) నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సోమవారం అధికారికంగా వెల్లించింది. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని వెల్లడించారు.

Read Also: Drunk and Drive: బెజవాడలో మందుబాబుల హల్‌చల్‌

మరోవైపు, గాంధీ కుటుంబాన్ని ఓడించి వయనాడ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బీజేపీ, సంఘ్‌ శ్రేణులు వయనాడ్‌లో ఆపరేషన్‌ స్టార్ట్ చేశారు. స్థానికంగా మంచి పేరున్న విద్యావంతురాలైన నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ ఎన్నికలబరిలోకి దించింది. ప్రియాంక గాంధీ స్థానికేతరురాలు అనే ప్రచారం చేస్తూ.. స్థానిక సెంటిమెంట్‌ను రగిలించాలని బీజేపీ యత్నిస్తున్నట్టు పలువురు రాజకీయ విమర్శకులు వెల్లడిస్తున్నారు. కాగా, వామపక్ష పార్టీలకు కంచుకోట కేరళ. అక్కడ అధికార పార్టీ కూడా వామపక్షాలదే. అందుకే, ఈ సారి ఎలాగైన వయనాడ్‌ను సొంతం చేసుకోవాలని ఎల్‌డీఎఫ్‌ సైతం పట్టుదలగా ఉంది.