MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC election polling: ప్రశాంతంగా రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472, మహిళలు 14,246 కాగా.. ఇతరులు ఇద్దరు ఉన్నారు.
137 పోలింగ్ కేంద్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూల్ జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 11, నారాయణపేట జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18, మేడ్చల్ లో 14 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు. . ఎన్నికల నిర్వహణకు 593 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇక.. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీవోలు, 137 మంది ఏపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 146 మందిని రిజర్వ్‌గా నియమించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టార్ కంట్రోల్ అధికారులను నియమించారు.
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
Read also: Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్‌డే విషెస్..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,822 మంది ఓటర్లు ఉండగా.. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇబ్రహీంపట్నంలో 207, మంచాలలో 62, యాచారంలో 85 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఎన్నికలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 109వ కేంద్రంలో 7 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు ఇప్పటికే బారులు తీరారు. పోలింగ్ సిబ్బంది సమయానికి వచ్చినప్పటికీ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడంలో జాప్యం జరగడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే.. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
ఏపీలోనూ ప్రశాంతంగా పోలింగ్..:
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!