స్త్రీల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చిన వారిపై అఘాతకాలు జరుగుతున్నాయి. ఇక ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసాడు ఓ కిరాతకుడు. మదనపల్లెలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫేస్ బుక్ ద్వారా బాలికకు దగ్గరై ప్రేమ పేరుతో పలుమార్లు లైంగిక దాడి చేసాడు ప్రైవేటు ఉపాధ్యాయుడు దినేష్. ఎవరికైనా ఈ లైంగిక దాడి విషయం చెబితే ఆత్యహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడి నుండి వేదింపులు ఎక్కవ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. భారీ ఫిర్యాదుతో దినేష్ పై పోక్స్ చట్టం కిందా కేసు నమోదు చేసి అరెస్టు చేసారు మదనపల్లె పోలీసులు.