Tarun Chugh: కేసీఆర్‌వి అన్నీ కలలే… మాదే అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గురించి ఆలోచించకుండా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కలలు కంటున్నాడు. కొందరు నిద్రలో కలలు కంటే ఇతను పగటి కలలు కంటున్నాడు. కేసీఆర్ కలలు నెరవేరవు. ఎనిమిదేళ్ళలో నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇన్ని రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకి కేసీఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు తరుణ్ చుగ్.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసింది కేసీఆర్. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు బీజేపీ భయపడదు. తెలంగాణ ప్రజలకు భయపడి కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్. తెలంగాణను కాపాడాల్సింది పోయి భ్రష్టు పట్టించారు. ముందు ముఖ్యమంత్రిగా నీ బాధ్యతలు నెరవేర్చు. తర్వాత ప్రధాని అవ్వాలని కలలు కను అంటూ చురకలేశారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి తనను ప్రధానిని చేయాలని మమత, దేవేగౌడ, అఖిలేష్, కేజ్రీవాల్, ఇతరులను కలిశాడు. కానీ ఎవరూ మద్దతు తెలపలేదు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ ఇండ్లు, దళిత బంధు ఇవ్వలేదు. కేసీఆర్ నెరవేర్చని హామీలపై మేము చర్చకు సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు తరుణ్ చుగ్. ఓపెన్ డిబేట్ కు మా తరుపున బండి సంజయ్ వస్తాడు.. కేసీఆర్ వస్తాడా? తెలంగాణలో మాకు మంచి పేరు వస్తోంది. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
Harish Rao : బీజేపీ నేతలు.. ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!