Tammineni: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ICU లో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవ్వాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం అంటుంది తెలిపారు.
ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్మోనాలజిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స సాగుతోంది. తమ్మినేని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
Read also: Royal Enfield Shotgun 650 : మార్కెట్ లోకి వచ్చేసిన కొత్త బుల్లెట్ బండి.. ఫీచర్లు, ధర ఎంతంటే?
ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. తన సోదరుడు వీరభద్రం అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఖమ్మం జిల్లా తెల్ధారపల్లిలో ఉన్నప్పుడు తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు తేలికపాటి గుండెపోటు లక్షణాలను గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Flight Cancel : ఢిల్లీ-ముంబై సహా 10 విమానాలు రద్దు, 18 లేట్.. ప్రయాణికులకు అందని సమాచారం