Royal Enfield Shotgun 650 : మార్కెట్ లోకి వచ్చేసిన కొత్త బుల్లెట్ బండి.. ఫీచర్లు, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్‌గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..
యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్ అయిన షాట్‌గన్ 650 ఫిబ్రవరి 2024 నుంచి అందుబాటులోకి రానుంది. మోటార్‌సైకిల్ యూకేలో 6,699 పౌండ్‌లు, యూరప్ (జర్మనీ, ఫ్రాన్స్) అంతటా 7,590 యూరోల వద్ద ప్రారంభమవుతుంది.. ఇండియాలో ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం కాగా, మార్చి నుంచి మార్కెట్ లోకి విడుదల కానుంది.. దేశంలో ఈ బైకు ధర రూ. 3,59,430 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ 2024 వసంతకాలం నుంచి అమెరికా, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ)లోకి ప్రవేశిస్తుంది. షాట్‌గన్ 650 ఎస్‌జీ650 కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది..
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
గోవాలో ఈ బైకు డిజైన్ చేయబడింది.. 650 ట్విన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా షాట్‌గన్ 650 648సీసీ, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 46.4హెచ్‌పీ గరిష్ట శక్తిని 52.3ఎన్ఎమ్ పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.. అలాగే స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది.. ఈ కొత్త బుల్లెట్ షాట్‌గన్ 650 స్టెన్సిల్ వైట్, ప్లాస్మా బ్లూ, గ్రీన్ డ్రిల్, షీట్ మెటల్ గ్రే అనే 4 కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో కూడిన డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌ను పొందుతుంది..
గతంలో వచ్చిన బైకుకు అప్డేట్ గా వచ్చింది.. ఫీచర్స్ అన్ని కూడా సరికొత్తగా ఉన్నాయి.. ఇక షాట్‌గన్ 650 కోసం 31 జెన్యూన్ మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ అందజేస్తుంది. వీటిలో బార్ ఎండ్ మిర్రర్స్, స్కల్ప్టెడ్ సోలో సీట్, కాంట్రాస్ట్-కట్ బిల్లెట్ రిమ్‌లు ఉన్నాయి.. వేరియంట్ ను బట్టి ధర కూడా నిర్ణయించారు.. మార్చిలో భారతదేశంలోకి రానుంది.. బుల్లెట్ లవర్స్ కు పండగే..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!