Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Krishnaiah: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన తమ్మినేని క్రిష్ణయ్య హత్యకేసులో పోలీసు దర్యాప్తుపై కుటుంబీకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఎన్టీవీతో తమ్మినేని క్రిష్ణయ్య బార్య మంగ తాయమ్మ కుమారుడు నవీన్, కుమార్తె రజిత మాట్లాడారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుపై క్రిష్ణయ్య , ప్రధాన సూత్రధారి కోటేశ్వరరావు పేరు లేదంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. కేసు దర్యాప్తులో పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాన్న (తమ్మినేని కృష్ణయ్య హత్య) హత్యకు కోటేశ్వరరావు కుట్ర చేసారని పోలీసులకు ఫిర్యాదు చేశాము. కానీ.. కోటేశ్వరరావు పేరు లేకుండానే రిమాండ్ రిపోర్టు కోర్టులో సమర్పించారని కన్నీరు పెట్టుకున్నారు. ఒత్తిళ్లతోనే కేసులో ప్రధాన సూత్రధారి పేరు లేకుండా చేశారని మండిపడ్డారు. మాకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తమ్మినేని కృష్ణయ్యను ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆగస్టు 15న ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఈహత్య జరిగినవిషయం తెలిసిందే.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
అయితే.. ఆగస్టు 18న తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులు అరెస్టు చేసారు. ఖమ్మం జిల్లా తెల్దార పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకే ఏడుగురు వ్యక్తులు కృష్ణయ్య హత్యలో పాల్గొన్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు. నిందితులన పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా A1 గాఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
CJI NV Ramana: సీజేఐ హ్యాపీడేస్.. ఏఎన్‌యూలో చదివిన రోజులను గుర్తుచేసుకున్న ఎన్వీ రమణ
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!