Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: తలసాని సంచలనం.. ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపే కుట్ర..!

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు..

Read Also: Mukesh Ambani: మళ్లీ అంబానీయే నంబర్‌ వన్‌.. అదానీ ఒక్కరోజుకే పరిమితం..!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కుక్కల్లా మొరిగిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ నేతలను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే.

Exit mobile version