Site icon NTV Telugu

Jagadish Reddy: తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి..

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(S) మండలం ఏపూరు గ్రామంలో ఐకేపీ కేంద్రంలో తడిసి మొలకెత్తిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతులతో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకున్నాం అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను తరలించుకుని పోతున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Virgin Boys: కాక రేపేలా ‘పెదవుల తడి’ సాంగ్!

ఇక, నీటి హక్కుల సాధన కోసం తెలంగాణ వాదులు, రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పైరవీలు చేసుకునేందుకు.. చంద్రబాబు చుట్టూ తెలంగాణ నేతలు తిరుగుతున్నారు.. ఆంధ్ర రాష్ట్రం సాగు, నీటి ప్రాజెక్టులకు ప్రధాని పెద్దపీట వేస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version