Peddagattu Jatara: తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర, పెద్దగట్టు, గొల్ల గట్టు, యాదవ గట్టు జాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఈసారి 15 లక్షల మందికి పైగా భక్త జనం వచ్చే అవకాశం ఉందని పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2007 వరకు మూడు రోజులు మాత్రమే జరుగిన జాతర, భక్తుల సంఖ్య ప్రతి జాతరకు పెరుగుతూ రావడంతో ఆ తర్వాత సంవత్సరం నుండి ఐదు రోజులకు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జాతర మొత్తం అంకం ఒకవైపు అయితే ట్రాఫిక్ సమస్య, భక్తుల రద్దీ రెండో సమస్యగా ఉండేది. అప్పుడు జాతర జరిగే రోజులలో సూర్యాపేట నుండి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక వరుసగా ఉండడం కూడా ట్రాఫిక్ సమస్య భక్తుల రద్దీకి ఒక కారణంగా ఉండేది. దీంతో 2009 నుండి భక్తజనం అధికంగా జాతరకు వస్తుండంతో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా మారింది.
Read also: Cabinet Meeting: బడ్జెట్ ఆమోదమే ఎజెండా.. నేడు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ
దీంతో జాతర మొదటి రోజైనా గంపల ప్రదర్శన రాత్రి, రెండవ రోజు, మూడవ రోజు పెద్దగట్టు పైకి భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మూడు రోజులలో ఆదివారం రాత్రి నుండి సోమవారం మంగళవారం సాయంత్రం వరకు పోలీసులకు ట్రాఫిక్ సమస్యను అదుపులో ఉంచడం కత్తి మీద సాముల ఉండేది. ఈ నేపథ్యంలో 2009 జాతర నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపులు చేపట్టేవారు. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే వాహనాలను సూర్యపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుండి ఖమ్మం మీదుగా కోదాడకు, విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కు వచ్చే వాహనాలను కోదాడ నుండి ఖమ్మం మీదుగా సూర్యాపేటకు మళ్లించేవారు. 2013 జాతరకు జాతీయ రహదారి పనులు పూర్తి అయినా వాహనాల మళ్లింపు మాత్రం ఆగలేదు. శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మల దర్శనార్థం భక్తుల రాక పెరుగుతూనే ఉంది.
Read also: KCR Nanded Tour: బీఆర్ఎస్ సభకు నాందేడ్ ముస్తాబు.. కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అవతరించాక నల్లగొండ జిల్లా, ఆ తర్వాత ఏర్పడిన సూర్యాపేట జిల్లా పోలీసులు జాతర జరిగే రోజులలో వానాల మళ్లింపును చేపట్టి కొంత ఉపశమనం కలిగించేవారు. ఇదే సాంప్రదాయం గత జాతర వరకు కొనసాగుతూ వచ్చింది. కానీ ఈసారి జాతరలో పోలీసుల ముందు చూపుతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి చర్యలు శాశ్వతంగా చేపట్టారు. జాతరలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తొలగిపోతుండటంతో రెండవది భక్తుల రద్దీ ని కూడా తగ్గించి, దర్శనం కూడా సజావుగా అయ్యేలా పోలీస్ శాఖ కసరత్తులు చేస్తుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మరో 500 మంది వలంటీర్లను నియమించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.