HMDA Prebid Meetings: ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ ..ఆన్ లైన్ ఆక్షన్ పై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లే అవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. రాజీవ్‌స్వగృహ భూములు, టవర్స్ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఆన్ లైన్ వేలం ప్రక్రియ గురించి అధికారులు వారికి అవగాహన కల్పించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్ మీటింగ్స్’’ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్‌ను ఆన్లైన్ వేలం(ఈ–ఆక్షన్) పద్దతిలో విక్రయాలకు పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్–హైదరాబాద్) రాజీవ్ స్వగృహ టవర్స్(అపార్ట్ మెంట్స్) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్సమావేశం జరిగింది.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లి(దుండిగల్ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మధ్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎస్.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్, సీజీఎం మాజీద్ షరీఫ్ లతో పాటు ఆన్ లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ అధికారులు హాజరయ్యారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ నాగోల్ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్(అపార్ట్ మెంట్స్)లతో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిందని, వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించినట్లు తెలిపారు. మిగతా వాటిల్లో చాలా వరకు రెడీ టు ఆక్యుపై (నివాసానికి సిద్ధంగా) ఉన్నాయని చెప్పారు. 2008 సంవత్సరంలో ముంబయికి చెందిన అర్కిటెక్చర్ కంపెనీతో డిజైన్ చేయించి నిర్మించిన ఇక్కడి అపార్ట్ మెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో అన్నిరకాల మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహకు సంబంధించిన ఎనిమిది టవర్స్(అపార్ట్ మెంట్స్) ప్రీబిడ్ సమావేశం శుక్రవారం నాడు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, హెచ్ఎండిఏ సూపరింటెండెంట్ ఇంజనీర్ యూసుఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కమిషనర్ వేలం ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించారు. హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న బాధ్యతల గురించి యూసుఫ్ హుస్సేన్ వివరించారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో హెచ్ఎండీయే ఇతర కార్పోరేషన్లు నిర్మించే ఫ్లాట్లు, డెవలప్ చేసి ఇచ్చే ప్లాట్లకు అనూహ్యమయిన డిమాండ్ ఏర్పడనుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!