Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Summer Effect Beer Sales Rise In Telangana

Beer Sales: సమ్మర్ ఎఫెక్ట్.. తెలంగాణలో మద్యం కిక్కు

Published Date :May 7, 2022 , 4:36 pm
By NTV WebDesk
Beer Sales: సమ్మర్ ఎఫెక్ట్.. తెలంగాణలో మద్యం కిక్కు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్‌ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్‌ వాల్యూపరంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్‌ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు. బీర్లకు భారీగా గిరాకీ ఏర్పడిందని, మద్యం ప్రియులు ఎండాకాలం బీర్లపైనే ఆధారపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

2021-22 లో లిక్కర్ 26,87,808 కేన్లు అమ్ముడయితే, బీర్లు 26,12,694 కేన్లు అమ్మేశారు. 2022-23లో లిక్కర్ 27,69,998 కేన్లు తాగితే బీరు ఏకంగా 43,84,285 కేన్లు తాగేశారు. తెలంగాణల బీర్ల అమ్మకాల్లో 10 జిల్లాల్లో కరీంనగర్ టాప్ లో నిలిచింది. 150 శాతం వరకూ అక్కడ బీర్ల అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మెదక్ లో 146 శాతం, కామారెడ్డిలో 124 శాతం అమ్మకాలు ఎక్కువగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 123 శాతం, ఆదిలాబాద్‌లో 122 శాతం, సంగారెడ్డి జిల్లాలో 120 శాతం బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం మరింతగా పెరగనుంది.

Minister KTR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రాబోయే 18 నెలల్లో 20 వేల ఉద్యోగాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beer Sales
  • Chilled Beers
  • excise income
  • heavy temperatures
  • karimnaga

తాజావార్తలు

  • Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు

  • Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!

  • Gold Rates Fall: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ.10 వేలు డౌన్..

  • Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?

  • Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions