Fire Broke out in Running Car: రన్నింగ్‌లో ఉన్న వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కొన్ని ప్రమాదాల్లో ఆ వాహనాల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నవారు కొందరైతే.. మరికొందరు.. ఆ మంటల్లోనే చిక్కుకుని అగ్నికి ఆహుతి అయిపోతున్నారు.. తాజాగా, హైదరాబాద్ శివారులో జరిగిన ఓ ప్రమాదం.. ప్రమాదం నుంచి ఓ కుటుంబం తప్పించుకుంది.. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తన కారు కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరాడు నవీన్ అనే వ్యక్తి.. అయితే, షాద్‌నగర్‌లోని సోలిపూర్ శివారుకు కారు చేరుకోగానే.. బెంగళూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఇది గమనించిన నవీన్ వెంటనే కారును నిలిపివేశారు.. కారులో ఉన్న తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి.. కారు నుంచి దించివేశాడు.. ఆ తర్వాత క్షణాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా.. కారు యజమాని సకాలంలో ప్రమాదాన్ని గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై ఆరా తీశారు.
Read also:Shalu Chourasiya: కేబీఆర్ పార్క్‌లో నటికి వేధింపులు..! మరోసారి వార్తలోకి నటి చౌరాసియా