Subhash patriji: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు.ఆయన వయసు 74ఏళ్ళు.గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఆయనను రెండు రోజుల క్రితం కడ్తాల్ మహేశ్వర పిరమిడ్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు సుభాష్ పత్రీజీ. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు సభ్యులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు అంత్యక్రియలకు తరలి రావాలని పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు సభ్యులు కోరారు. సుభాష్ పత్రిజీ నిజామాబాద్‌లోని బోధన్‌లో జన్మించారు. గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించారు.
Also Read
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
అదే ఏడాది డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఆ తర్వాత ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు నిర్వహించి ధ్యానం విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను ఆయన గతంలో స్థాపించారు. సుభాష్ పత్రీజీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు.
సుభాష్ పత్రీజీ మన రోజువారీ జీవితంలో మరియు ధ్యానం సమయంలో పిరమిడ్‌లను ఎలా ఉపయోగించవచ్చో వివరించారు.శ్వాసపై ధ్యాస పెడితే ఆరోగ్యం సిద్ధిస్తుందని పత్రీజీ సెలవిచ్చేవారు. ధ్యానమే సర్వరోగ నివారిణి అనేవారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, తోటివారితో కలిసి ధ్యానం చేయడం వల్ల వారిలో కూడా శక్తులు వస్తాయని పత్రీజీ బోధించేవారు.జ్ఞాపక శక్తితో పాటు, మనశ్శాంతి, ఆయుష్షు పెరుగుతుందని బ్రహ్మర్షి పత్రీజీ తన ప్రసంగాల్లో వివరించేవారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..