Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు. రాత్రి భోజనంలో పురుగులు ఉన్నాయంటూ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయని విద్యార్థులు యూనివర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు.
Read also: Dating Scam With Girls: నగరంలో కొత్తరకం మోసం.. అమ్మాయిలతో మోష్ పబ్ డేటింగ్ స్కామ్
విద్యార్థులకు మద్దతుగా ఎన్ ఎస్ యూఐ నాయకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ ధర్నా చేపట్టారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుని పురుగుల మందు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. గతంలోనూ చాలాసార్లు భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళనలు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వర్సిటీ హాస్టల్‌లో నిరసన తెలిపారు. యూనివర్సిటీకి పలమార్లు వచ్చిన మల్లారెడ్డి నాణ్యమైన భోజనం అందిస్తామని విద్యార్థులకు మాట ఇచ్చారని గుర్తుకు చేశారు. అయితే తరువాత కూడా యూనివర్సిటీ యాజమాన్యం భోజనం అలానే అందిస్తుందని మండిపడ్డారు. నాణ్యమైన ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకుని భోజనం మాత్రం పురుగులు, ప్లాస్టిక్ వస్తులు వస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మల్లారెడ్డి వీటిపై వెంటనే స్పందించాలని కోరారు. న్యాయం జరిగేంతవరకు నిరసన విరమించమని తెలిపారు. మరి దీనిపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Graduate MLC Bypoll: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..