Dating Scam With Girls: హైదరాబాద్‌లో కొత్త తరహా డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో ప్రేమలో పడి తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. కానీ కొందరు పబ్ యజమానులు దాన్ని అవకాశంగా తీసుకుని అమ్మాయిలతో కొత్త మోసానికి పాల్పడ్డారు. దీంతో కొంత మంది యువకులు భారీగా డబ్బులు పోగొట్టుకుని లబోదిబో మంటున్నారు. ఇటీవల ఓ అబ్బాయి టిండర్ డేటింగ్ యాప్‌లో రితిక అనే అమ్మాయి పరిచయం అయ్యింది. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రావాలని ఇద్దరు కలుద్దామని పిలిచింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి హద్దులేకుండా పోయాయి. మోసపోతున్నానని గ్రహించలేక రితిక పిలిచిన చోటుకు మరుసటి రోజు పరుగులు పెట్టాడు. ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. కాసేపు ఆ యువకుడితో మాటలు కలిపిన రితిక స్టేషన్ పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కి వెళ్దామని కోరింది. అంతే ఇది ఇంకా పెద్ద ఛాన్స్ గా అనుకున్నాడు యువకుడు.
Read also:CS Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్.
అయితే అతని మాటల్లో ఆ యువకుడు ఒక వ్యాపారవేత్తగా గ్రహించిన ఆ యువతి ఇతని బురిడీ కొట్టించేందుకు ప్లాన్ వేసింది. అమ్మాయి పబ్ వెళ్దామని చెప్పడంతో అతను అంగీకరించాడు. వ్యాపారవేత్తను పబ్ లోకి తీసుకు వెళ్లిన తన తియ్యని మాటలతో డ్యాన్స్ లో దింపింది. ఆతరువాత గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి రితిక తాగింది. అంతే అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. అయితే రితిక ఎంతకు కనిపించకుండా పోవడంతో షాక్ తిన్నాడు వ్యాపారవేత్త. అయితే రితికకు వెతుకుతున్న సమయంలో ఆ వ్యాపారవేత్త దగ్గరకు 40505 రూపాయిలు బిల్ ను చేతిలో పెట్టాడు. సరే పదో పదుకొండు వేలో బిల్లు వచ్చిందనుకున్న అబ్బాయి ఆ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ గురైయ్యాడు. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని వ్యాపారవేత్త అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఇంత బిల్లు నేను కట్టలేనని వాదించిన బెదిరించి ఆ వ్యాపారవేత్తతో డబ్బులు కట్టించుకుని బయటకు పంపారు.
Read also:Houthi Rebels: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. యూఏఈకి వెళ్తున్న ఓడ సమీపంలో పేలుడు
బయటకు వచ్చిన ఆ వ్యాపారవేత్త అనుమానం వచ్చి పబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా మోసం బడ్డబయలు అయ్యింది. వ్యాపారవేత్త లాగా మోస పోయిన వేరే యూసర్ రాసిన రివ్యూ చూడగా అసలు మోసం బయటకు వచ్చింది. పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసమని మోసం చేస్తున్నారని గుర్తించారు. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. 20 వేల నుంచి 40 వేల బిల్లులు చేసి చేతులు పెట్టి అమ్మాయి వెళ్ళిపోతున్నట్లు గ్రహించారు. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసం పైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయటపెట్టిన వ్యాపారవేత్త. పబ్బు యజమానులు కక్కుర్తి పడి అమ్మాయిలతో ఎలాంటి నేచర్ పనులు చేస్తున్నారని గుర్తించారు. డబ్బులు కట్టకపోతే బలవంతంగా బాధితులను బెదిరించి డబ్బులు కట్టిస్తున్న వ్యాపారవేత్తలు పబ్ యజమానులని వ్యాపారవేత్త వాపోయాడు. మరి దీనిపై మోష్ పబ్ డేటింగ్ స్కామ్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.
Sunita Williams: అంతరిక్షంలోకి చేరుకోగానే ఆనందంతో చిందులేసిన వ్యోమగామి విలియమ్స్