సంగారెడ్డి జిల్లా రుద్రారం లోని గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గీతం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 65 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడంతో విద్యార్థులు యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. గీతం ప్రొఫెసర్ వీసీ శివ ప్రసాద్ బయటకు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పటాన్ చెరు పోలీసులు గీతం యూనివర్సిటీ వద్దకు చేరుకొని విద్యార్థులను ఆదుపు చేసే ప్రయత్నం చేశారు విద్యార్థులు మరింత ఆందోళన ఉదృతం చేయడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
Read Also:Jogi Ramesh: ఎందుకీ డ్రామాలు.. సానుభూతి పవనాలు
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ 65శాతం కంటే తక్కువ హాజరు ఉన్న దాదాపు 3,000 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుందన్నారు. ఒక్కో సబ్జెక్టుకు 7,500 చొప్పున కట్టమంటున్నారని అయినా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం పరీక్షలు వ్రాసేందుకు అనుమతి ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తేల్చిచెప్పారు. అయితే యుజీసీ నిబంధనల మేరకు మాత్రమే తాము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, తమ సొంత నిర్ణయాలు ఉండవని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్దుల ఆందోళనతో యూనివర్శిటీ ప్రాంగణం అంతా గందరగోళంగా మారింది.
Read Also: ఈ హీరోయిన్లందరూ రాజవంశస్థులని తెలుసా..?