హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చని సూచించారు. మార్చి 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి…
ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వైభవంగా సాగుతోంది. ఇవాళ్టికి 13వ రోజుకి చేరింది. ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇవాళ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో శ్రీరామనగరం భక్త జన సంద్రంగా మారింది.