SSC Exam : తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరం నుండి ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న 80% బాహ్య మూల్యాంకనం (External Assessment), 20% అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) పద్ధతిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ఆగస్టు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంలో జారీ చేసిన కొన్ని ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, పాత విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ ఆర్డీజేలు, రాష్ట్రంలోని అన్ని డిఇఓలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకు డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ ఆమోదం తెలిపి, సంబంధిత శాఖాధికారులకు పంపించారు.
Pulivendula Elections: ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు!