భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవక్షేత్రాలకు వెళ్లి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది టీఎస్‌ఆర్టీసీ. అయితే.. మహా శివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు రంగారెడ్డి రీజియన్ నుండి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 16 నుండి 19 వరకు నడపబడతాయి. టీఎస్‌ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ మరియు ఇతర ప్రాంతాల నుండి నగరం నుండి ప్రారంభమవుతాయి.
Also Read : Today (07-02-23) Business Headlines: అప్‌డేట్ అవుతున్న తెలంగాణ ప్రగతి రథ చక్రాలు
MGBS నుండి శ్రీశైలం వరకు సూపర్ లగ్జరీకి రూ.600, డీలక్స్‌కు రూ.540, ఎక్స్‌ప్రెస్‌కి రూ.460గా నిర్ణయించారు టీఎస్‌ఆర్టీసీ అధికారులు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు సూపర్ లగ్జరీకి రూ.650, డీలక్స్‌కు రూ.580, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.500గా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం, ప్రయాణికులు 9959226248, 9959226248 మరియు 9959226257 (MGBS) నంబర్‌లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా.. www.tsrtconline.inలో టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
Also Read : Abdul Razzaq: ఆసియా కప్ దుబాయ్‌లో నిర్వహిస్తే మంచిదే: పాక్ మాజీ క్రికెటర్