ఈమధ్య కాలంలో వన్యప్రాణులు, పాములు, ఏనుగులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. కార్లు, స్కూటర్లు, ఇళ్ళల్లోకి పామలు, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. గంట పాటు అటవీశాఖ సిబ్బందిని పాము తిప్పలు పెట్టింది. రెస్క్యూ ఆపరేషన్ చేశాక కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక్కసారిగా విశేష అతిథి సందడి చేసింది. ఉదయం కార్యాలయం తెరిచేసరికి ఓ పాము హల్చల్ చేసింది. కలెక్టర్ సి ఛాంబర్ లో…