New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
- ఫోన్ దొంగతనం.. బ్యాంక్ ఖాతాలే టార్గెట్
- పాస్వర్డ్ గమనించి.. ఫోన్ కొట్టేస్తారు!
- అన్‌లాక్ అయితే నిమిషాల్లో డబ్బు మాయం
- ఫోన్ పోతే వెంటనే ఇవి చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ పోతే కేవలం ఫోన్ మాత్రమే పోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే! మీ ఫోన్‌తో పాటు మీ జీవితకాల కష్టార్జితం కూడా నిమిషాల్లో మాయమయ్యే ప్రమాదం వచ్చిపడింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చి ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ అనే సరికొత్త దొంగతనాలకు తెరలేపారు. ఒకవైపు భౌతికంగా ఫోన్ల చోరీకి పాల్పడుతూనే, మరోవైపు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక డేంజర్ కేటుగాళ్ల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
టార్గెట్ వృద్ధులు, అమాయకులు: దొంగతనం జరిగే తీరు
ఈ సైబర్ ముఠాలు ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు , ఇతర బహిరంగ ప్రదేశాలను తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుని, వారు ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో స్క్రీన్ అన్‌లాక్ చేయడానికి టైప్ చేసే పాస్వర్డ్, PIN లేదా ప్యాటర్న్‌ను పక్కనే ఉండి చాకచక్యంగా గమనిస్తారు. ఆ తర్వాత క్షణాల్లో ఫోన్‌ను దొంగిలిస్తారు. ఒకవేళ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ తెలియకపోతే, వీరు మరింత తెలివిగా ప్రవర్తిస్తారు. కండక్టర్ లేదా డ్రైవర్‌గా నటిస్తూ బాధితులకు వేరే ఫోన్ నుండి కాల్ చేసి, “మీ ఫోన్ మాకు దొరికింది, అది మీదేనా కాదా అని సరిచూసుకోవడానికి స్క్రీన్ లాక్ పాస్వర్డ్ చెప్పండి” అని సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్స్ ఉపయోగించి లాక్ వివరాలు రాబడతారు.
Also Read
- Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
- Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
అన్‌లాక్ అయ్యాక జరిగే విధ్వంసం
ఫోన్ చేతికి దక్కడం, అన్‌లాక్ కావడం పూర్తయిన వెంటనే కేటుగాళ్ల అసలు దందా ప్రారంభమవుతుంది. ఫోన్లోని గ్యాలరీ, నోట్స్, మెసేజ్‌లు , వాట్సాప్ ఛాట్లను పూర్తిగా జల్లెడ పడతారు. అందులో భద్రపరిచిన డెబిట్/క్రెడిట్ కార్డుల ఫొటోలు, ఆధార్, పాన్ కార్డు వివరాలు , బ్యాంకింగ్ PINలను సేకరిస్తారు. దొంగిలించిన ఫోన్లోనే SIM ఉండటంతో, దానికి వచ్చే OTPలను ఉపయోగించి UPI, మొబైల్ బ్యాంకింగ్ , నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను సులభంగా రీసెట్ చేసి నిమిషాల్లో డబ్బు మొత్తాన్ని కాజేస్తారు. ఇలా దోచుకున్న సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ వాలెట్లు , నకిలీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇతర ఖాతాలకు మళ్లిస్తారు.
అరెస్టులు , పోలీసులు ఇస్తున్న ముఖ్యమైన సూచనలు
ఈ సరికొత్త మోసంపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ హైబ్రిడ్ ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 ఖరీదైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేశారు. ఫోన్ పోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేసి SIM కార్డ్‌ను బ్లాక్ చేయాలని, అలాగే బ్యాంకులను సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్, UPI సేవలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించాలని సూచించారు. ఫోన్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు IMEI నంబర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR పోర్టల్‌లో నమోదు చేసి బ్లాక్ చేయాలని తెలిపారు. ఒకవేళ ఖాతా నుండి డబ్బులు కట్ అయినట్లయితే, వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..