Singer Mangli : న్యాయవాది సుభా సియపోగపై సింగర్ మంగ్లీ ఫిర్యాదు..
- మంగ్లీపై తప్పుడు ఆరోపణల కేసు
- రూ.150 కోట్ల మోసం అంటూ ప్రచారం
- బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు
- నార్సింగి పోలీసుల కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సింగర్ గాయని మంగ్లీ తనపై సామాజిక మాధ్యమాల్లో, బహిరంగంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. న్యాయవాది సుభా సింగబోష్ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సుమారు 150 కోట్ల రూపాయల మోసం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల మార్చి 21వ తేదీన సుభా సియపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి, అత్యంత అమర్యాదగా, బెదిరించే ధోరణిలో మాట్లాడారని మంగ్లీ పోలీసులకు వివరించారు. తనను నేరుగా కలవాలని ఆయన ఒత్తిడి చేశారని, ఒకవేళ కలవడానికి నిరాకరిస్తే సమాజంలో అప్రతిష్ట పాలు చేస్తానని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Mojtaba Khamenei: ఇరాన్‌కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
మంగ్లీని భయపెట్టే క్రమంలో నిందితుడు ఆమెకు ఏమాత్రం సంబంధం లేని భారీ కరెన్సీ నోట్ల కట్టలు ఉన్న ఒక వీడియోను చూపించి బెదిరించినట్లు సమాచారం. మరో వ్యక్తితో కలిసి తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వరుస పరిణామాల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తన వృత్తిపరమైన జీవితంపై కూడా ఇది ప్రభావం చూపుతోందని ఆమె పోలీసులకు తెలిపారు. మంగ్లీ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న నార్సింగి పోలీసులు, సుభా సింగబోష్‌పై BNS సెక్షన్లు 79 , 351(3) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా, పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారు.
Sunrisers Hyderabad History: సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన మైలురాయి.. ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!