NTV Telugu Site icon

Harish Rao: గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ తుడిచి పెట్టాలని చూస్తుంది..

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.

Read Also: Earthquake: మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు.. తీవ్రత 5.8గా నమోదు

ఇక, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయొద్దు అని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకి వరప్రదాయిని.. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి అని సూచించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు, రైతు భరోసా, పూర్తి స్థాయిలో అందరికి రుణమాఫీ చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులకు 24గంటల పాటు కరెంట్ ఇచ్చాం.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.