Site icon NTV Telugu

KCR: ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. నేను కొడితే మాములుగా ఉండదు

Kcr

Kcr

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వుంచుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు.. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది.. నేను చెప్పిన ప్రజలు వినలేదు.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కి ఓటేశారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధుకి రాంరాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను.. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కి ఓటేశారని ఆరోపించారు.

Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..

రాబోయే రోజుల్లో విజయం మనదే.. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని కేసీఆర్ అన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి.. భూముల ధరలు అమాంతం పడిపోయాయి.. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయిందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే.. ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమేనని అన్నారు. ఏడాది నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.. త్వరలోనే భారీ సభ పెట్టుకుందామని తెలిపారు. అన్ని మబ్బులు తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయి.. మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారు.. ఫామ్ హౌస్‌లో పంటలు తప్ప ఏముంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..

Exit mobile version