Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా
- కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు
- ప్రాజెక్టులో సెల్ఫీ దిగడానికి వెళ్లిన ఏడుగురు యువకులు
- ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు యువకులు
- గల్లంతైన యువకులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తింపు
- కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ ఆరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో సరదాగా స్నేహితులు కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్లి ఫోటోలు దిగుతూ ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
Read Also: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా బయటపడ్డ యువకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈత రాకపోవడంతో ఒకరి చేయి పట్టుకుని మరొకరు డ్యామ్ లోకి దిగారు. ప్రాజెక్టు లోపల మునిగిపోతుండగా భయతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకోవడంతో యువకులు నీటిలో మునిగిపోయారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన యువకులలో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా ఉన్నారు.
Read Also: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ
కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రప్పించాలని తెలిపారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!