Sri Ram Navami Shobha Yatra: హైదరాబాద్ లో ఘనంగా సాగుతున్న శ్రీరాముని శోభాయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Ram Navami Shobha Yatra: హైదరాబాద్ లో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఓల్డ్ సిటీలోని సీతారాంబాగ్ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభమైంది. ఈశోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు.. దూల్ పెట్ సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఇక ఆకాశ్‌పురి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర కొనసాగుతుంది.
Read also: Bhatti vikramarka: కోదండరామస్వామి ఆలయ సన్నిధిలో భట్టి విక్రమార్క.. స్వామివారికి ప్రత్యేక పూజలు
Also Read
హైదరాబాద్ లో శ్రీ రామ నవమి ఘనంగా జరుగుతున్నాయి. రామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రను పర్యవేక్షించేందుకు నియమించారు. రామ నవమి శోభ యాత్ర ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిలో ఉంది. అదనంగా, IT సెల్ యొక్క సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఏర్పాటు చేశారు. ఇక ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు , దర్గాను గుడ్డతో కప్పారు. నవమి శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో చూస్తే వణికిపోవడం పక్కా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..