Shamshabad Airport New Look: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్తరూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొత్త రూపు దిద్దుకుంది. విస్తరణ పనులు పూర్తి కావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ను ప్రారంభించారు అధికారులు. విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ రోజు నుండి అంతర్జాతీయ విమానాలు ఈ టర్మినల్ నుండి నడవనున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలురాయికి చేరువైంది. ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తికావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ప్రారంభమైంది. సెకండ్ ఫేస్ పనులు ముగింపు దశకు చేరడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు జిఎంఆర్ ఆధికారులు.
అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకున్న రంగురంగుల వాటర్ ఫాల్స్ ప్రయాణికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయ్. 2005 లో మూడేళ్ల లక్షంతో మొదలు పెట్టిన జిఎంఆర్ సంస్థ 2008 లోనే కేవలం 30 నెలలో ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తేవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో 12 మిలియన్ ప్రయాణికుల సామర్ధ్యంతో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. సౌత్ ఏషియా లోనే తొలి గ్రీన్ బిల్ట్ ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగింది. అయితే 12, మిలియన్ ప్రయాణికుల సామద్యంతో ఎయిర్ పోర్ట్ ను నిర్మించినప్పటికి ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రెండింతలు దాటింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు జిఎంఆర్ సంస్థ శ్రీకారం చుట్టింది. 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో టర్మినల్ ను విస్తరించారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
Read Also: Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే
ప్రస్తుతం విస్తరణ పనులు ముగియడంతో అంతర్జాతీయ హంగులతో ఎయిర్ పోర్ట్ సర్వాంగ సుందరంగా రుపొందించారు. ప్రయాణికులను ఇట్టే కట్టిపడేసేల నూతన టెర్మినల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నూతన టెర్మినల్ పూర్తి కావడంతో ఈ రోజు దానిని ప్రారంభించారు. ఇక ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని జిఎంఆర్ ఆధికారులు తెలిపారు. విమానాశ్రయ దశలవారి విస్తరణలో భాగంగా తాత్కాలికంగా అంతర్జాతీయ టర్మిణల్ ను ముసివేస్తున్నారు. ప్రధాన టెర్మినల్ కు అనుసంధానంగా విస్తరణ పూర్తయ్యాక అక్కడి నుండి సర్వీసులు మళ్ళీ ప్రారంభమౌతాయని తెలిపారు.

అప్పటివరకు దేశియ టర్మినల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతాయని ఆధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఎస్ వి 750కి అంతర్జాతీయ విమానం భయలుదేరనునట్లు ఆధికారులు వెల్లడించారు. అప్పటి నుండి అంతర్జాతీయ విమానాలు దేశీయ టర్మనల్ నుండి వెళ్ళాలని తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. టెర్మినల్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నిర్మాణంతో ఎయిర్ పోర్ట్ రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ప్రయాణికులు.
Read Also; Karthikeya: కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రీ-లుక్ రిలీజ్
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!