Karthikeya: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇటీవల సినిమా కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ప్రీ-లుక్ ని విడుదల చేశారు. 30వ తేదీ ఉదయం 10:40 కి ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, సమర్పకులు యువరాజ్, దర్శకుడు క్లాక్స్ చెబుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పై ఎంతో నమ్మకంతో ఉన్నామని, కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో వినోదం, భావోద్వేగాలు ఉంటాయంటున్నారు.
కార్తికేయ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, మెలోడీ బ్రహ్మ మణిశర్మ చక్కటి పాటలందించారని, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తమ చిత్రంలో ఓ పాట రాయడం విశేషమంటున్నారు. అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ఈ సినిమాలోని ఇతర ముఖ్యపాత్రధారులు.