Dharmapuri Arvind: చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమే జీవన్ రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సారంగపూర్ మండలం తుంగురు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ఇది లాస్ట్ ఎలక్షన్ అని చెప్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ గోసాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల PFI కి అడ్డ, జీవన్ రెడ్డి గెలిస్తే లవ్ జీహాదికి అడ్డ అవుతుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు.
Read also: Dharmana Prasada Rao: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ధర్మాన..
మహిళల గ్రూపులకు లోన్లు ఇచ్చింది, వడ్డి రాయితీ ఇచ్చింది మోడీ అన్నారు. రాజీవ్ గాంధీ బొమ్మ లేదని, ఆయుస్మాన్ భారత్ కార్డ్ లు ఇస్తలేరన్నారు. మామిడి రైతులను నాశనం చేసింది, చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణం జీవన్ రెడ్డి అని తెలిపారు. రొల్లవాగు జగిత్యాలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది, నీళ్లు వాస్తలే కానీ నిధులు, కమిషన్లు వస్తున్నాయన్నారు. 500 బోనస్ ఇస్తలే కానీ తరుగు మాత్రం తీస్తున్నారని తెలిపారు. 45 సంవత్సరాలలో జగిత్యాలకు జీవనం రెడ్డి ఏం చేసాడు? అని ప్రశ్నించారు. ఈ ఎన్నిక ధర్మాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నిక అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీజేపీకి ఓటు వేయాలని అన్నారు.
Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..