CPI Narayana: తులసి వనంలో గంజాయి.. తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, సీపీఐ కు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం మూడు పార్టీలు ఎలిమినెట్ అవుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఒప్పందంలో భాగంగానే ముందుకు వెళుతున్నాయన్నారు. గోషామాల్ లో బిజెపి నుంచి రాజసింగ్ పోటీ చేసే చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టలేదు… కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి అని కీలక వ్యాఖ్యలు చేశారు. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు చేసేవాన్ని డ్రామాలే అంటారని మండిపడ్డారు. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే తెలంగాణ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయదు అనే అపోహ ఉందని తెలిపారు. పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్ కు సీపీఐ సపోర్ట్ చేస్తుందనే అపవాదు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టితో చెక్ పెట్టాలని తెలిపారు.
Read also: Black Friday Sale: కళ్లు చెదిరే ఆఫర్స్ తో భారీ సేల్.. ఆ వస్తువుల పై డిస్కౌంట్స్..
అజయ్ కు సపోర్ట్ చేస్తే సీపీఐ లోని ఎంత పెద్ద నేత ఉన్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. తులసి వనంలో గంజాయి పువ్వాడ అజయ్ కుమార్ అని మండపిడ్డారు. తండ్రికి ముడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్ అన్నారు. అటువంటి వ్యక్తికి సీపీఐ మద్దతు ఇవ్వదన్నారు. జిల్లాలో పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయ్ నే అన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ కావాలంటే కాంగ్రెస్ రావాలని తెలిపారు. ప్రతి మహిళకు 30 వేలు రూపాయలు సంవత్సరంలో వస్తాయన్నారు. రెండు లక్షల ఉద్యోగులు ఏడాదిలో భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ 9 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మేము కేవలం ఏడాదిలో 2 లక్షల ఉధ్యోగాలు ఇస్తామన్నారు.
ఇప్పుడు ప్రజలకు అనివార్యం కాంగ్రెస్ పాలన అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రైతు భరోసాలోనే ఉంది 24 గంటల ఉచిత విద్యుత్ అని అన్నారు. రైతులకు, కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు. 61 స్థానాలతో కాదు, పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఫార్మ్ హౌస్ పాలనను తరిమికొడతామన్నారు. తెలంగాణలో బీజేపీ చుమంథర్ చేయలేదని, సీబీఐ,ఈడీ లతో భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
Bandi Sanjay: రైతులకు మోడీ రూ.24 వేలు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే