Dr K Laxman: ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నాడని తెలిపారు. వేరొక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన వారిని కూడా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Love Mouli Navdeep: శుభలేఖ షేర్ చేసి పెళ్లి ముహుర్తం ఫిక్స్ అంటున్న నవదీప్.. వధువు ఎవరంటే..?!
అప్పుడు అవినీతి పరులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సుద్ధ పూసలయ్యారా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న వారు కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ లో ముఖ్య నేతలే అని తెలిపారు. అలాంటి వారు కాంగ్రెస్ లో చేరడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఆరు గ్యారెంటీ ల విషయంలో కాంగ్రెస్ చేతిలో మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. అందుకే ఎలాగైనా ఎంపీ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తుందన్నారు.
Astrology: మార్చి 31, ఆదివారం దినఫలాలు