పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ అక్రమ రవాణాకు తరలించే పనిలో పడుతున్నారు. అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అక్రమ రవాణా మాత్రం ఏదో ఒక విధంగా కొనసాగుతూనే వుంది. కొద్ది రోజుల క్రితం రెండు దఫాలుగా కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. అయినా అక్రమ రవాణాకు పాల్పడ్డారు కొందరు. ఈసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
read also: BJP District President: ద్రౌపదీ ముర్ము విజయోత్సవ సభ.. తప్పతాగి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఐదు మంది ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన EK-526, 6E-1406 రెండు వేరు వేరు విమానంలో ఐదు మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల వద్ద 25 లక్షల విలువచేసే నిషేదిత విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సిగరేట్లను తమ లగేజీలోని లోపలి భాగంలో దాచుకుని వస్తుండగా పోలీసులు గుర్తించారు. సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు.
జూన్ 12న విమానాశ్రయంలో కువైట్ నుండి హైదరాబాద్ కు వచ్చిన మహిళ ప్రయాణికురాలు వద్ద బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.646 కేజీల అక్రమ బంగారం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుకున్న బంగారం విలువ 86 లక్షలు ఉంటుందన్నారు. ఓ ప్రయానికురాలు పేస్ట్ రూపంలో సాక్స్ లలో బ్లాక్ కవర్ లో పెట్టి బంగారం తరలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళ ప్రయానికురాలిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
CM Nitish Kumar: బీహార్ సీఎంకు కరోనా పాజిటివ్.. ఏడాదిలో ఇది రెండోసారి