ఆస్పత్రుల్లో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా వుంటుంది. నిత్యం రోగులతో వుండే చోట వైద్యులు, రోగులను సెక్యూరిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే ఓ ప్ర్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపం రోగిబంధువులను కంగారుపెట్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రిలో సెక్యూరిటీ లో బయటపడ్డ డొల్లతనం విమర్శల పాలవుతోంది. ఓ ఆగంతకుడు డాక్టర్ వేషంలో icu లోకి ప్రవేశించి రోగి కేస్ షీట్ ను నర్స్ ద్వారా తీసుకుని అందులో ఉన్న పేషేంట్ అటెండేట్ నెంబర్ కి కాల్ చేశాడు.
పేషెంట్ కి సర్జరీ చేయాల్సి ఉంది వెంటనే 50 వేల రూపాయలు ఆవుతాయని అనడంతో ఖంగు తిన్న అటెండర్ .తాము ESI కింద ఆసుపత్రిలో జాయిన్ అయ్యామని తామెందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నిచింది. విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తేవడంతో విషయం బయటపడింది. దీంతో బాధితురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ…లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ఆసుపత్రిలో ఇంతటి గోరమైన భద్రత వైఫల్యం ఉంటే తమ రోగుల భద్రత కు బాధ్యులెవరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రత్యర్థులు ఇలా నేరుగా ఐసీయూలోకి ప్రవేశించి పేషెంట్ కు ఏదైనా హాని తలపెడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్యూరిటీ నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సిబ్బందితో పాటు ఆసుపత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదుచేశారు.