నేటి నుండే తెలంగాణ విద్యా సంస్థలు ప్రారంభం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. అయితే ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హెకోర్టు.. పిల్లలను బడికి రావాలని బలవంత పెట్టొద్దని సూచించింది. స్కూళ్లు తెరుచుకోవచ్చని చెప్తూనే.. కండీషన్స్ అప్లై అంటోంది న్యాయస్థానం.
తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నేటి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానుంది. స్కూళ్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొన్ని షరతులు విధిస్తూ స్కూళ్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాలలకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని కండిషన్ పెట్టింది. స్కూళ్లకు రాని విద్యార్థులతో పాటు తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో క్లాసులు ప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. వారంలోపు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఉత్తర్వులు ఇచ్చారని.. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయని.. అలాంటప్పుడు స్కూళ్లను తెరిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. భౌతిక తరగతులపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్ తీవ్రత కొనసాగుతోందని చెప్పిన న్యాయస్థానం… సెప్టెంబరు-అక్టోబరులో కరోనా మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని వ్యాఖ్యానించింది. తర్వాతి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
నేటి నుంచి స్కూల్స్ ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. ఇష్టం లేకుంటే పిల్లలను ఎవరూ బలవంత చేయొద్దని పాఠశాలలకు సూచించింది. పాఠశాలల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే కీలక మార్గదర్శకాలు జారీ చేసింది విద్యాశాఖ.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!