తెలంగాణలో నేటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. అయితే ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హెకోర్టు.. పిల్లలను బడికి రావాలని బలవంత పెట్టొద్దని సూచించింది. స్కూళ్లు తెరుచుకోవచ్చని చెప్తూనే.. కండీషన్స్ అప్లై అంటోంది న్యాయస్థానం. తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నేటి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానుంది. స్కూళ్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొన్ని షరతులు విధిస్తూ స్కూళ్ల…