Site icon NTV Telugu

Modi Hyderabad Tour: హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. టూర్ షెడ్యూల్ ఇదే..!

Modi

Modi

Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 8 న వారణాసి నుండి హైదరబాద్ కి ప్రధాని మోడీ ఉదయం 9.45 కి హాకిం పెట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి హెలి కాప్టర్ లో వరంగల్ కు ఉదయం 10.35 కి వరంగల్ కు ప్రధాని చేరుకుంటారు. ఉదయం 10.45 నుండి 11.20 వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.30 నుండి 12.10 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.20 కి వరంగల్ నుండి రిటర్న్ హకీమ్ పేటకు చేరుకుని రాజధానికి పయనం కానున్నారు.

Read also: Harish Rao: మెడికల్ కాలేజ్ అడ్మిషన్ రూల్స్ సవరణ.. సర్కార్ ఉత్తర్వులు

కాగా.. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న‌ హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.
OMG: కోపంతో ప్రియుడిపైకి ఐదు సార్లు కారు ఎక్కించి చంపిన ప్రియురాలు

Exit mobile version