Satyavathi Rathod: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod Speech On Women Day: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోందని ఆరోపించారు. గ్యాస్ ధరలు సైతం అమాంతం పెంచేశారని మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు మహిళలకు సమాన హక్కులు ఉండేవి కావని, ఓటు హక్కు కూడా లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ఏ ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. మహిళలకు.. ముఖ్యంగా గర్భవతి సమయంలో పౌష్టికాహారం అందించడంతో పాటు డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆలోచించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు సైతం కేసీఆర్ ప్రభుత్వం పంచిందని చెప్పుకొచ్చారు.
Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
అంతకుముందు.. తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడిగా అవతరిస్తారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పని చేస్తున్నారని.. వీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టి సారించారన్నారు. పోలీసులకు ఎక్స్ గ్రేషియా పెంచడంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీలను అందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. ఫిర్యాదులు చేయడానికి, పోలీస్ స్టేషన్‌కు చిన్నారులతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఫ్రెండ్లీ రూమ్ ఏర్పాటు చేశారన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు