Raghunandan Rao Talks About ITIR Project: కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ITIR ప్రాజెక్ట్‌ను ఇవ్వడం లేదని.. మోడీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ దాడి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఐటీ కోసం అభివృద్ధి చేయడమని.. 2008లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు అది మంజూరు చేసిందని తెలిపారు. 202 చదరపు కిలోమీటర్ల స్థలంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 2013 నుండి 2018 వరకు, అలాగే 2018 నుండి 2038 వరకు.. రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని ప్లాన్ వేశారని చెప్పారు. ఇందుకు 4 వేల 863 కోట్లు సహకారం ప్రకటించిన కేంద్రం.. ఆ మొత్తంలో 3 వేల 275 కోట్లు మంజూరు చేసిందని తెలియజేశారు.
Naveen Reddy Atluri: సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్.. నమ్మించి నట్టేట ముంచాడు
ఈ ITIRపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదన్న ఆయన.. రైల్వే లైన్‌కీ సహకారం అందించలేదని ఆరోపించారు. మెట్రో సైతం వేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో సంబందం లేని అమెజాన్‌కి లాండ్ కేటాయించినా.. కేంద్రం అభ్యంతరం తెలపలేదన్నారు. నగర అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చిందని.. అయినా కేంద్రం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని బురద చల్లడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ITIRకి కేంద్రం ఇచ్చేదాని కన్నా ఎక్కువ నిధుల్ని మంజూరు చేసిందన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం DPRలు సబ్మిట్ చేయలేదని.. ఫేస్ 1ను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనందుకే కేంద్రం ITIRను రద్దు చేసిందని ఆయన వివరించారు.
Shehbaz Sharif: భారత్‌కి పాక్ ప్రధాని బెదిరింపు.. పాదాల కింద నలిపేస్తాడట!
అంతకుముందు.. సిరిసిల్ల, సిద్దిపేటలో తన పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానంటూ రఘునందనరావు ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ బీహార్‌కు సంబంధించిన వ్యక్తేమోనన్న అనుమానం వస్తోందని.. బీహార్ అధికారులనే తెలంగాణ సీఎస్, డీజీపీగా నియమించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బీహార్ వ్యక్తి అని ఆంధ్రా వాళ్లు అంటే తాము కాదన్నామని, కానీ ఇప్పుడు తమకే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.
Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం