Ghanpur MLA Ticket: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వన్ ఛాన్స్ ప్లీజ్ అంటు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని జానకీపురం సర్పంచ్ నవ్య కోరుతున్నారు. మహిళ ఎమ్మెల్యే అయితే మహిళలు తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఆమె అన్నారు. మాదిగ బిడ్డ అయిన తనకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఆమె ధీమాగా చెప్పారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళ.. తనకు అవకాశం ఇవ్వాలని నవ్య కోరుతున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సర్పంచ్ నవ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హైకమాండ్ జోక్యంతో రాజయ్య నవ్యతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. నవ్య ఆరోపణలు, కడియం శ్రీహరిపై రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధిష్ఠానం రాజయ్యకు టికెట్ నిరాకరించింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించారు. అయితే కడియంపై రాజయ్య బలపడుతున్నారు. మాదిగ సామాజికవర్గాన్ని మొత్తం కలుపుకుపోయేందుకు రాజయ్య ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే టిక్కెట్టు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఈరోజు (సెప్టెంబర్ 1) ఆమె హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తామని బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రకటించగా.. రాజయ్య వెనక్కి తగ్గకపోవడంతో తాజాగా నవ్య కూడా టికెట్ కోరడంతో.. బీఆర్‌ఎస్ నాయకత్వానికి స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం తలనొప్పిగా మారింది. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో.. ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారో చూడాలి. 1994 నుంచి 2009 వరకు మధ్యలో నాలుగేళ్లు మినహా ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి చక్రం తిప్పారు. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి రాజయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా కూడా రాజయ్య పనిచేశారు. కానీ కేసీఆర్ మాత్రం కారణం చెప్పకుండానే మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరించారు.
SBI Recruitment 2023: నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. 6100 ఉద్యోగాలు భర్తీ..