Ghanpur MLA Ticket: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వన్ ఛాన్స్ ప్లీజ్ అంటు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని జానకీపురం సర్పంచ్ నవ్య కోరుతున్నారు. మహిళ ఎమ్మెల్యే అయితే మహిళలు తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఆమె అన్నారు.
స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరైన ఆధారాలు సమర్పించలేదని పోలీసులు వెల్లడించారు.