Rat in Chutney: సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు అందరూ షాక్ అయ్యారు. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ విద్యార్థులను కాసేపు బెంబేలెత్తించింది. చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో ఎలుక చట్నీలో పడి అటు ఇటు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎలుకని చూసిన విద్యార్థులు భయబ్రాంతులకు లోనయ్యారు. చట్నీలో వండిన మిరపకాయ, కరివేపాకు లాగానే ఎలుక కూడా కనిపించింది. దీంతో చట్నీ వండిన వారికి అనుమానం రాలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆ ఎలుక చట్నీలోనే చనిపోయి వున్నా ఎలుక అని గమనించే విధంగా లేదని విద్యార్థులు చెబుతున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లోనే ఇలా వుంటే మిగతా హాస్టల్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ఇలాంటి ఆహారాలు తినే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆహారాలన్నే రోజూ వండి మాకు పెడుతున్నారా? ఇలాంటి ఆహారమే మనం రోజూ తింటున్నామా? అనే ప్రశ్నలు విద్యార్థుల్లో మొదలయ్యాయి. ఇలా సుభ్రత లేకుండా ఆహారం వండటంతో అనారోగ్య బారిన పడవల్సి వస్తుందని వాపోతున్నారు.
Read also: Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్
ఇలాంటి ఘటనలు మన తెలియకుండా యాజమాన్యం మీద భరోసాతో పురుగులు పట్టిన భోజనం రోజూ తింటున్నామా? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటి కైనా యాజమాన్యం స్పందించాదలని కోరుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వండే ఆహారాలపై మూతలు పెట్టకుండా వండటం, శుభ్రత లేకుండా వండటంపై ఆరోగ్యశాఖ కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు అనారోగ్య బారిన పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతలేని ఆహారం వండి విద్యార్థలకు అనారోగ్య బారిన పడే అవకాశాలు వున్నాయని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ ను సందర్శించి యాజమాన్యంతో చర్చించి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?