Sandra Venkata Veeraiah Strong Counter To Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యాశాఖ మీద అవగాహన లేకుండా బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా చేసుకోవాలో.. ముందు అది చూసుకోండని హితవు పలికారు. పక్క రాష్ట్రం మీద విద్యావ్యవస్థ, ఉద్యోగ నియామకాల మీద అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బొత్స వ్యక్తిగంతంగా మాట్లాడారా? లేక ఇది ప్రభుత్వ విధానమా? అనేది స్పష్టం చేయాలని కోరారు.
Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
తెలంగాణలో సక్రమమైన పద్ధతిలో అన్ని రకాల నియామకాలు చేపట్టి, కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యొగులకు పీఆర్‌సీలు ఇవ్వాలని ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో తమ ప్రభుత్వం వాటాలు ఇస్తోందన్నారు. ఆర్టీసీని సైతం తమ ప్రభుత్వం కాపాడిందన్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియమకాలు చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎవరు తప్పు చేశారో ప్రభుత్వమే గుర్తించి వారిని శిక్షిస్తుంటే.. మీరు అవహేళన చేస్తారా? అని బొత్సను ప్రశ్నించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసవరించుకోవాలి అన్నారు. తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసిన మంత్రిపైన ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
BS Rao: బీఎస్ రావు ప్రస్థానం.. అసలు ఎందుకు శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు..
కాగా.. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కామ్‌లు జరిగాయో చూశామని, అన్ని చూచిరాతలేనని అన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని.. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని పేర్కొన్నారు. ఈ విధంగా బొత్స చేసిన వ్యాఖ్యలకు పై విధంగా ఎమ్మెల్యే సండ్ర ఘాటుగా స్పందించారు.