NTV Telugu Site icon

Salu Dora Selavu Dora Digital Board: మళ్లీ వెలసిన ఫెక్సీలు.. సాలుదొర సెలవు దొర అంటూ డిజిటల్‌ బోర్డు

Salu Dora Selavu Dora Digital Board

Salu Dora Selavu Dora Digital Board

Salu Dora Selavu Dora Digital Board: తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్‌ షురూ చేస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపుతోంది. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణపైనే పెట్టుకుంది. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సాలుదొర.. సెలవు దొర పేరుతో డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు కల్వకుంట్ల కౌంట్ డౌన్ అని నామకరణం చేసి.. కేసీఆర్ ను అధికారం నుంచి దింపేందుకు ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో డిజిటల్ బోర్డులో గంటలు, నిమిషాలు, సెకన్లు చేర్చారు.

Read also: Rajamouli-Mahesh Movie Update: మహేష్‌తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి

అయితే ఈ డిజిటల్ బోర్డును నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేయగా.. అనుమతి లేకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారనే కారణంతో దాన్ని తొలగించాలని జీహెచ్ ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఆదేశాలతో బోర్డు ప్రదర్శనను కొద్దిరోజుల పాటు నిలిపివేసింది బీజేపీ. ఆ తర్వాత ఉప ఎన్నికల కారణంగా ఈ బోర్డును బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. మొన్నటి ఉప ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరడంతో డిజిటల్‌ బోర్డు మళ్లీ ప్రత్యక్షమైంది. నిన్న (నవంబర్ 19)న మళ్లీ తాజాగా పునఃప్రారంభించి.. ఎన్నికలు ముగిసే వరకు బోర్డు ఉంచనున్నట్లు తెలిపారు బీజేపీ శ్రేణులు. మళ్లీ ప్రారంభమైన ఈ బోర్డులో కేసీఆర్‌ను అధికారం నుంచి తప్పించేందుకు ఇంకా 382 రోజుల సమయం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై సీఎం కేసీఆర్‌ ఎలా స్పిందిచనున్నారు? జీహెచ్‌ ఎంసీ అధికారులు చెప్పిన బీజేపీ మళ్లీ ఈ డిజిటల్ బోర్డును ఎర్పాటు చేయడం పై ఆంతర్య ఏమిటి? అంటు రాష్ట్ర రాజకీయంలో చర్చ జరుగుతుంది.
Harish Rao: డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్

Show comments