Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా నిషేధిత కలుపు మొక్కలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైడ్రోఫోనిక్ కలుపు మొక్కలను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన కలుపు మొక్కల విలువ సుమారు రూ.2.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు తన ట్రాలీ బ్యాగ్ లో కలుపు మొక్కలను దాచి తరలించే యత్నం చేశాడు.
ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బ్యాంకాక్ నుంచి విమానం ల్యాండ్ అయ్యింది. అయితే బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వెళ్లడం గమనించారు కస్టమ్స్ అధికారులు. అతని ట్రాలీ బ్యాగ్ ను తనిఖీ చేయగా షాక్ కు గురయ్యారు. లగేజ్‌బ్యాగ్ లో నిషేధిత కలుపు మొక్కలు దాచి ఉండటం అధికారులు గుర్తించారు. నివాటి స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అదుపులో తీసుకున్నారు. అతనిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో వున్న వ్యక్తులుతో డీల్ కుదుర్చుకున్నాడా? అనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. ప్రయాణికుడి మొబైల్ స్వాధీనం చేసుకుని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు విషపూరిత పాములు కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బ్యాంకాక్ నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Astrology: నవంబర్ 29, శుక్రవారం దినఫలాలు