NTV Telugu Site icon

Rowdy Gang: రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ చేసి బట్టలిప్పి స్థంబానికి కట్టేసి అరాచకం

Rowdy Gang

Rowdy Gang

Rowdy Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్‌ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బెల్ట్ , రాడ్లతో చితకబాదారు. వాటిని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కాప్స్‌ బరిలోకి దిగింది. 24 గంటల్లోనే నిందితులను ఆట కట్టించి. రాజేంద్రనగర్ సన్ సిటీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ అహ్మద్ తో పాటు అతని అనుచరులు సయ్యద్ మహ్మద్ ఫహాద్, షోయబ్ అఖ్తర్, మహ్మద్ ముద్దాసర్ ల అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ పై గతంలో పలు కేసులు నమోదు చేశారని, అతనిపై 2018లో కొత్తూర్, నార్సింగీ పోలీసులు PD యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.

Read also: Himachal Pradesh CM: హిమాచల్‌ తదుపరి సీఎంపై నేడు కీలక నిర్ణయం.. ఎక్కువ ఛాన్స్‌ వారికే..!

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో A2 మహ్మద్ ఫహాద్, A3 మహ్మద్ ముద్దాసీర్ నిందితులపై హత్యతో పాటు Arms యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షేక్ ఇర్ఫాన్ అహ్మద్ గ్యాంగ్ తో బాధితుడు మహ్మద్ ఇర్ఫాన్ తిరగడం లేదనే కక్షతో కిడ్నాప్ చేసి ఈ అరాచకానికి పాల్పడ్డారని వివరించారు. ఈ నెల 5వ తారీఖున ఇర్ఫాన్ ను ఆటోలో రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం బాదితుడిని రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ వద్ద ఓ నిర్మాణంలో భవనం వద్దకు తీసుకొని వెళ్లిన‌ గ్యాంగ్. తన ఒంటిపై బట్టలు విప్పి వేసి నగ్నంగా పిల్లర్ కు తాళ్లతో కట్టేసి అరాచకం సృష్టించారని తెలిపారు. (సంబాలాతో సంబాలా నహీతో షాజ్ పే హమ్లా) అంటూ బాధితుడిపై దాడి చేశారని, బెల్టులతో, రాడ్స్ తో విచక్షణారహితంగా చితకబాదినట్లు తెలిపారు. అతనిపై దాడి దృశ్యాలను వీడియో తీసి సొషియల్ మీడియాలో రౌడీ గ్యాంగ్ పోస్టు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి వారుంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్యాంగ్‌ అంటూ ఇలా అరాచకానికి పాల్పడితే కఠిచర్లు తీసుకుంటామని హెచ్చరించారు.
Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు