Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Write A Letter To Cm Kcr About Warangal Orr

Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Published Date :May 22, 2022 , 12:17 pm
By Venu Goapl Reddy
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై  సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఒక దశ దిశ చూపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని… తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్న జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో డెవలప్మెంట్ లేదని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికీ కూడా రెవెన్యూ విలేజ్ హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. మైకుల ముందు తండాలను గ్రామపంచాయతీలు చేశామని పెద్దపెద్ద మాటలు చెబుతారు కానీ.. జయశంకర్ సార్ ఊరికి ఇప్పటికీ రెవెన్యూ హోదా ఇవ్వలేదంటే ఆయన పట్ల మీకున్న గౌరవం అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. దళిత బంధు అని గొప్పలు చెప్పుకుంటున్నా… దళితుల్లో ఎలాంటి మార్పు రాలేదని లేఖలో విమర్శించారు. అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు( ఓఆర్ఆర్)  నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరిస్తుందని…కాంగ్రెస్ పార్టీ మౌళిక సదుపాయాలకు వ్యతిరేఖం కాదని.. అయితే ఓఆర్ఆర్ పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతుందని ఆరోపించారు. ఓఆర్ఆర్ కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో 24,517 ఎకరాలు సేకరిస్తోందని… దీంతో లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డన పడే పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఇందులో అధిక శాతం రెండు, మూడెకరాలు కలిగిన సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని.. ప్రభుత్వం వారి నోటికాడి ముద్దనను లాక్కుంటుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కి తీసుకోవాలని… లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Outer Ring Road
  • revanth reddy
  • TPCC
  • Warangal

తాజావార్తలు

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions