NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఢిల్లీ టు మహారాష్ట్ర.. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే.. మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం సీఎం రేవంత్ రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. అనంరతం ఇవాళ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి తరఫున ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు మహాకూటమి నేతలు సిద్ధమయ్యారు.

Read also: Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

తెలంగాణ తరహాలో సక్సెస్ మంత్రం సిద్ధం చేయాలని మహా అఘాది నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహాలు, అనుసరించాల్సిన విధివిధానాలను కూటమి నేతలకు వివరించనున్నారు. మహారాష్ట్రలో ర్యాలీలు, రోడ్లు, షోలు, కార్నర్ మీటింగ్‌లకు సంబంధించిన కార్యక్రమాలను నేతలకు సీఎం వివరించనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మహాకూటమి తరపున భారీ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు ప్లాన్ చేస్తున్న తరుణంలో వచ్చే వారం సీఎం మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Patnam Narender Reddy: లగచర్ల ఘటన.. కేబీఆర్‌ పార్క్‌ వద్ద పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌..

Show comments