Patnam Narender Reddy: లగచర్ల ఘటన.. కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్..
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
- లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patnam Narender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్‌ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు నరేందర్ రెడ్డికి లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా ? మాట్లాడిన వారు ఎవరు ? అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Also Read
సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు.. అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారని, ప్రధాన నిందితుడు సురేష్ కావాలని కలెక్టర్ ను మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకొని వెళ్లారన్నారని ఐజీ సత్యనారాయణ తెలిపిన విషయం తెసిందే. సురేష్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరున్న వదిలిపెట్టేది లేదని తెలిపారు. సురేష్ కాల్ డేటా అంతా తీస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. ప్రస్తుతం సురేష్ పరారీ లో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఐజీ తెలిపారు. సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Astrology: నవంబర్ 13, బుధవారం దినఫలాలు
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..