తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం చేసారు పోలీసులు. దీనిపై స్పందించి రేవంత్ రెడ్డి సీఎం పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే నిర్భంధించారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శ్రేణులను నిర్భంధిస్తే తప్ప తెలంగాణ సీఎం ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారని విమర్శించారు. దీనికి నిదర్శనమే ఉమ్మడి ఖమ్మం జిల్లా…